తెలుగు సాహిత్యంలో దండకములు - 1
ప్రవేశిక
ఆదికవి నన్నయ్యనుండి,
ఆధునిక కవులవరకూ, ఎందరో
కవులు తమ సాహిత్య సృష్టిలో,
దండకమును ఒక చందోరీతిగా ఎన్నుకొన్న విషయం మనకు తెలిసినదే. ప్రాచీనకవులు, అధునిక కవులు, సినిమా కవులు
ఇలా అన్ని వర్గాల కవులూ దండకమును ఒక
ఛందోరీతిగా స్వీకరించిన వారే.
పొతనామత్యుడు శ్రీమదాంధ్ర భాగవతములో కధానుసారముగా కొన్ని
దండకములు రచించడమే కాక,
"భోగినీ దండకము" అను పేర ఒక గ్రంధం మొత్తమును ఈ ఛందో
రీతిలో రాయడం, తెలుగు
సాహిత్యంలో అరుదైన విషయం. తర్వాత కవులలో కూడా యెందరో భక్తి ప్రధానమైన దండకములు
రూపొందించి, చిన్న
చిన్న గ్రంధములుగా ప్రకటించిన సంఘటనలు కోకొల్లలు.
అయితే వివిధ కవులు,
దండకమును ఒక ఛందోరీతి గా ఎన్నుకొన్న సందర్భాలు వేరు. ఆసందర్భాలను వర్గీకరిస్తే, ప్రార్ధనా పరమైన
దండకములు, కధా ప్రధానమైన
దండకములు, వ్యంగ్యంతో
కూడిన హాస్య భరితమైన దండకములు,
మొదలైన వివిధ రీతుల దండకములు, తెలుగు
సాహిత్యంలో కనిపిస్తాయి. అటువంటి అనేకమైన దండకములలో, వీలైనన్నింటిని ఈ "రసధుని" బ్లాగు ద్వారా మన ఇక్కడ
పరిచయం చేసుకుందాం.
ఈ "దండకము" అనే ఛందోరీతికి ఛందోనియమాలేమిటి? దండకములన్నీ ఒకే
ఛందోరీతిలో సాగుతాయా? - ఇటువంటి
విషయాలను కూడా మనం ఇక్కడ వీలువెంట ప్రస్తావించు కుందాం. రండి. మనం ఇప్పుడు ఒక్కొక్క దండకమును అస్వాదిస్తూ ముందుకు
సాగుదాం.
ధన్యవాదములు
బుధజనవిధేయుడు
చల్లా రామలింగశర్మ.
No comments:
Post a Comment